
ప్రతిష్టాత్మక Olympic పోటీలు నిర్వహించాలన్న స్వప్నం సాకారం చేసు కునే దిశగా భారత్ తొలి అడుగువేసింది. 2036లో ఒలింపిక్స్ నిర్వ హించేందుకు తమకు ఆసక్తి ఉన్నదంటూ భారత ప్రభుత్వం అంతర్జాతీయ Olympic కమిటీ (ఐసీ)కి అధికారికంగా ఓ లేఖ పంపింది. దీంతో సాధారణ ఒలింపిక్స్, ఆ వెంటనే జరిగే పారాలింపిక్స్ నిర్వహణను దక్కించుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించబోతున్నదన్న విషయం స్పష్టమైంది.
Olympic Games 2036 ..భారత్ తొలి అడుగు
ఈ క్రీడల అతిథ్యం కోసం పోటీ తీవ్రంగా ఉండనుంది. హక్కుల కైవసానికి పోటీపడే దేశాల సంఖ్య రెండంకెల్లో ఉందట. వీటిలో సౌదీ అరేబియా, ఇండోనేసియా, కతార్, తుర్కియే నుంచి భారత్కు గట్టిపోటీ ఎదురవవచ్చు. దీనికి ముందు 2030లో జరిగే యూత్ ఒలింపిక్స్కు సైతం మనమే వేదికగా నిలవాలని మోదీ ఆకాంక్షించారు.
మన ప్రయత్నాలు సఫలమై భారత్కు Olympics కేటాయిస్తే అవి ఏ నగరంలో జరుగుతాయన్న విషయమై ఇప్పటికే ఓ స్పష్టత వచ్చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం అహ్మదాబాద్కు ప్రధాన వేదికగా అవకాశం ఇస్తారన్న విషయమూ అవగతమైంది. భారత క్రీడాప్రాధికార సంస్థకు చెందిన మిషన్ Olympic సెల్ (ఎంఓసీ) సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ భారత ఒలింపిక్ స్వప్నాన్ని ఆవిష్కరించారు.
Olympic Games.. India Plan Stay in 4th Position In Future:
మోదీ ఆకాంక్ష నెరవేరితే భారత్ ఈ ఘనతను అందుకున్న నాలుగో ఆసియా దేశంగా గణుతికెక్కు తుంది. ఇంతకుముందు చైనా, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో ఒలింపిక్స్ జరిగాయి. అన్నీ కలిసివచ్చి భారత్కు ఆ భాగ్యం దక్కితే.. మన దేశంలో ప్రజాదరణ పొందిన కొన్ని క్రీడల్ని జాబితాలో చేర్చడం దాదాపు ఖరారైనట్టే. వాటిలో టీ20 క్రికెట్, యోగా, కబడ్డీ, ఖో-ఖో, చెస్, స్క్వాష్లను పొందుపరు స్తారని భావిస్తున్నారు.
వచ్చే ఏడాది మార్చిలో ఐఓసీకి ఎన్నికలు జరిగిన అనంతరం మాత్రమే వేదిక ఖరారవుతుంది. ఇక 2036 కంటే ముందు 2028లో అమెరికా, 2032లో ఆస్ట్రేలియాలో Olympics జరగనున్నాయి. మరోవైపు భారత్కు ఒలింపిక్స్ కేటాయింపు చేయరాదంటూ పాకిస్థాన్ ఓ వ్యతిరేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పాక్ వేదికగా జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీకి మన జట్టును పంపేందుకు భారత ప్రభుత్వం నిరాకరిస్తున్న నేపథ్యంలో దానికి పాక్ ప్రతీకారం తీర్చుకోవాలని యోచిస్తోందంట.
ఈ మేరకు అంతర్జాతీయ Olympic కమిటీని సంప్రదించి, భారత్కు నిర్వహణ అవకాశం ఇవ్వరాదని దాయాది దేశం కోరనుందట. భారత్ వేదికగా 1951, 1982 సంవత్సరాల్లో ఆసియా క్రీడలు, ఆ తర్వాత 2010లో ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. కామన్వెల్త్ క్రీడలకు సంబంధించి లోపభూయిష్టమైన నిర్వహణ, అవినీతి ఆరోపణలు, భద్రతాపర మైన సమస్యలతో భారత్ ప్రతిష్ట మసకబారింది.
కామన్వెల్త్ క్రీడలు … భారత్ ప్రతిష్ట:
కామన్వెల్త్ పోటీల నిర్వ హణను అస్తవ్యస్తం చేసిన మన వ్యవస్థలు Olympics విషయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. క్రీడల కుంభమేళాగా చెప్పుకునే ఒలింపిక్స్ నిర్వహణలో ఖర్చు అంశం అన్నింటిలోకీ అత్యంత ప్రధానమైనది. అనుకున్న అంచనాలు అవధులు దాటడం సర్వసాధారణం. ఆటలు ముగిశాక ఆర్థికంగా కునారిల్లిన దేశాలను చూశాం.ఎన్నో పోస్ట్‌లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు.
ఆటల పండుగను నిర్వహించే చాన్స్ లభిస్తే ఆయా నగరాల్లో కొంతమేర పర్యాటకం అభివృద్ధి చెందవచ్చునుగాక. అలాగే మౌలిక వసతులూ, అంతర్జాతీయ స్థాయి స్టేడియాలు సమకూరుతాయ నడంలోనూ సందేహంలేదు. అయితే ఆ తర్వాతే అసలు సమస్య ఉత్పన్న మవుతుంది. అట్టహాసంగా నిర్మించిన స్టేడియాలు తెల్ల ఏనుగుల్లా మారిపో తాయి.
స్టేడియాల ఆలనాపాలనా తలకుమించిన భారమవుతుంది. అంతే కాదు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నది ఆర్థిక నిపుణుల అంచనా. తాజాగా జరిగిన పారిస్ ఒలింపిక్స్ కోసం ఆ దేశం సుమారు 77 వేలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. అయితే భారత్లో లాంటి అభివృద్ధి చెందు తున్న దేశాలు ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి వుంటుంది.
Olympic Games..భారత్ ఆర్థిక వ్యవస్థ:
ఓ అధ్యయనం ప్రకారం Olympics నిర్వహించిన అనంతరం ఆయా దేశాల ఆర్థిక ప్రగతి తీవ్రంగా మందగించింది. దీనికి ప్రధాన కారణం క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై పెట్టిన ఖర్చు పూర్తిగా నిరుపయోగంగా మారడమే. ఉదాహరణకు 1988 సియోల్ ఒలింపిక్స్ తర్వాతి ఏడాది దక్షిణ కొరియా జీడీపీ దారుణంగా పడిపోయింది.
ఇక గ్రీసు, ఏథెన్స్, రియో క్రీడల తర్వాత ఆ దేశాల పరిస్థితి కూడా ఇదే. 2016 రియో క్రీడలకోసం ఉపయో గించిన స్టేడియాల్లో చాలావరకు ఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. 1976 Olympic నిర్వహించిన కెనడాకు ఆ అప్పులనుంచి బయటపడడానికి మూడు దశాబ్దాలు పట్టింది. ఆతిథ్య దేశాలు నిర్వహణ ఖర్చు విషయంలో అత్యంత ప్రణాళికబద్ధంగా వ్యవహరించిన బిలియన్ డాలర్ల నష్టాలు మామూలే.
ఏదేమైనా పోటీల నిర్వహణ అవకాశం భారత్కు దక్కుతుందా లేదా అనేది నిర్ధారణ కావడానికి మరికొంత సమయముంది. ఆ అవకాశం భారత క్కు దక్కితే గత పోటీల ఆతిథ్య దేశాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాల్సివుంది. అనవసర ఖర్చులు, ఆడంబరాలకు పోకుండా నియంత్రించు కోవాలి. క్రీడా సంస్కృతి లోపించిన భారత్లో Olympic నిర్వహణతోనైనా ప్రజల్లో ఆ దిశగా కొంతమేర అవగాహన ఏర్పడినా అదే పదివేలు.
భారత్లో Olympic నిర్వహణ:
ఇది భారతదేశానికి కేక్‌వాక్ కాదు, అయితే, కనీసం మూడు ఇతర ధృవీకరించబడిన బిడ్‌లతో – చిలీ (శాంటియాగో), ఇండోనేషియా (జకార్తా, బాలి మరియు నిర్మాణంలో ఉన్న కొత్త రాజధాని నుసాంటారా) మరియు టర్కీ (ఇస్తాంబుల్) — మరియు నగదు అధికంగా ఉండే రియాద్ మరియు ఖతార్ వంటి వాటితో సహా IOCతో అంతర్గత సన్నాహాలు మరియు చర్చల యొక్క వివిధ దశల్లో మరిన్ని.
భారత ఒలింపిక్ సంఘం సభ్యుల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాల కారణంగా భారతదేశ ప్రయత్నాలకు కూడా ఆటంకం కలుగుతుంది, దీని వలన IOA పని చాలా నెలలుగా దాదాపుగా నిలిచిపోయింది. ప్రభుత్వ ఆసక్తి మరియు ఒత్తిడి ఉన్నప్పటికీ, IOA IOCతో కమ్యూనికేషన్ యొక్క అధికారిక ఛానెల్‌గా మిగిలిపోయింది మరియు భారతదేశం యునైటెడ్ ఫ్రంట్‌ను ఉంచడానికి దాని ప్రమేయం చాలా కీలకం.