EV E-VEHICLES DRIVE IN INDIA – భారతదేశంలో విద్యుత్ వాహనములు

*****Please Visit My Youtube Channel ComTech.Rstvarthi for Engineering Entertainment Educational Filmy shorts.*****

పర్యావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి EV వాహనాల పథకాలను ప్రవేశపెడుతోంది. పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల సంఖ్యను క్రమంగా తగ్గించడానికి సంకల్పించి ఒక్కొక్కటిగా పథకాలను ప్రవేశ పెడుతూ వస్తోంది. 2015 ఫేమ్ (ఎఫ్ఎంఈ) తొలిదశతో మొదలైన ఈ పథకాల పరంపర, తరువాత ఫేమ్ -2. ప్రేమ దశలను అధిగమించి ప్రస్తుతం పీఎం ఈ-డ్రైవ్ వరకు వచ్చింది.



దేశంలో తిరుగుతున్న పెట్రోలు, డీజిల్ ఇంధన వాహనాలను క్రమంగా తగ్గించి రోడ్లపై EV VEHICLES వాహనాల సంచారం పెంచడానికి అనువుగా ఈ పథకాలు రూపుదిద్దుకున్నాయి. దేశంలో 2016లో గల విద్యుత్ వాహనాల ( ఈ వీ-ఎలక్ట్రిక్.. వెహికిల్స్) సంఖ్య కేవలం 4,800, అయితే అప్పటికే చైనాలో వాటి సంఖ్య 48 లక్షలు. కేంద్రం వివిధ పథ కాల ద్వారా ప్రకటించిన రాయితీల వల్ల వినియోగదారులు ఈవీల పట్ల ఆకర్షి తులు కావడంతో దేశంలో వాటి సంఖ్య ఇప్పటికి 30 లక్షలకు చేరడం శుభపరిణామం.



కానీ చేయాల్సింది ఎంతో ఉంది. 2015 నాటికి దేశంలో గల EV కేవలం వందల్లోనే. ప్రజలకు ఈవీలపై అవగాహన పెంచి, అపోహలను తొలగించి, కొనుగోళ్లకు రాయితీలివ్వడం, రిజిస్ట్రే షన్ ఫీజు, పన్ను వెసులుబాట్లు కల్పించడం వంటివి పేమ్-1లో ప్రధా నంగా ఉన్నాయి.

ఫేమ్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ పథకం 2015లో మొదలై, 2019లో ముగిసింది. దీనికి రూ.785 కోట్లు కేటాయించారు. దాదాపు 28 లక్షల ఈవీలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరింది. EV ప్రోత్సాహం, బస్సుల మంజూరు, మౌలిక సౌకర్యాల కల్పన, గిరాకీ (డి మాండ్) పెంచడం ఈ పథకం ప్రధాన నిర్దేశిత లక్ష్యాలు.



తొలిరోజుల్లో హైబ్రీడ్ అంటే విద్యుత్, పెట్రోల్ రెండింటి మీద నడిచే వాహన వినియోగానికి ప్రోత్సాహం కలిపిం చారు. క్రమేణా EV ఉత్పత్తి పెరగడంతో హైబ్రీడ్ విధానం మందగించింది. జాతీయ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ ప్లాన్ (ఎన్ఎస్ఈఎంఎంపీ)లో ఫేమ్ ఒక భాగం. E వెహికల్స్ గురించి ఎన్నో పోస్ట్‌లు బ్లాగులు ఇంటర్నెట్ లో ఉన్నాయి.

EV విధానంలో కేంద్రప్రభుత్వం నికి గణనీయ గేర్ మార్చింది. ప్రజల్లో అవగాహన పెరిగి, అమ్మకాలు మెరుగుపడటంతో, కొనుగోలుదారులకు ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని పథకానికి భారీ పరిశ్రమల శాఖ మరిన్ని మెరుగులు దిద్ది ఈ-డ్రైవ్ను 2004 సెప్టెం బరు 11 నుంచి అమలులోకి తెచ్చింది.



తొలి రెండేళ్లకు రూ.10.900 కోట్ల నిధులు కేటాయించారు, ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, అంబులెన్స్లు, ట్రక్కులు, ఇతర ఈవీల కోసం 679 కోట్లు దీనికి ప్రత్యేకించారు. 28 లక్షల ఈవీల కొనుగోలుదారులకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. 24.79 లక్షల ద్విచక్ర వాహనాలు, 3,16 లక్షల త్రీవీలర్స్, 14,208 బస్సులు కూడా ఈవీలుగా రోడ్లపైకి రానున్నాయి. అంబులెన్స్లకు రూ.500 కోట్లు, ట్రక్కుల కోసం రూ.500కోట్లు, బస్సులకు రూ.4,931 కోట్లు అందుబాటులో ఉంచారు.



ప్రజా రవాణా కోసం కొనుగోలు చేయడానికే కాకుండా వాటి నిర్వహణకు గాను రూ.3,434 కోట్లను కేటా యించారు. ఫేమ్లోని లోపాలను సరిదిద్దారు. గతంలో విదేశాల నుంచి నేరుగా తెచ్చుకున్న EV’S కూడా రాయితీలు అందచేశారు. విమర్శలు రావడంతో ఇలాంటి వాటిని తొల గించారు. అలా రాయితీలు పొందిన కంపెనీలు ఆ డబ్బును తిరిగి చెల్లించాలి. చెల్లిందని ఆటోమొబైల్ కంపెనీలను ఈ పథకం నుంచి దూరంగా ఉంచుతున్నారు.



దేశవ్యాప్తంగా 88,500 ప్రదేశాల్లో EV చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు నిధులు ఇవ్వనున్నారు. వీడి భాగాలు తయారీ పరిశ్రమ లకు ఉత్పత్తి ఆధారంగా ప్రోత్సాహకాలు(పీఎల్ఐ) కల్పించ నున్నారు. ద్విచక్ర వాహనాల మార్కెట్లో 10 శాతం, త్రిచక్ర వాహన విపణిలో 15 శాతం 20:28 మార్చి 2 నాటికి ఒడిసిపట్టడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ పనిచేస్తుందని కేంద్రమంత్రి హెచ్.డి.కు మారస్వామి తెలిపారు.

అయితే ఇంతకాలం ఉన్న నాలుగు చక్రాల వాహనాలకు (కార్లకు) ఈ పథ కాన్ని వర్తింపచేయకపోవడం చర్చనీయాంశం అవుతోంది. కార్ల కొనుగోలుపై ఉన్న జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే డమే అందుకు కారణమని చెబు తున్నారు. హైబ్రీడ్ వాహనాలకు రాయితీలను కూడా తీసేశారు. ఫేమ్ పథకంలో అనుచితంగా కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు లబ్ది పొందాయన్న ఆరోపణలు
వచ్చాయి.



దేశవాళీ ఉత్పత్తి కొనుగోళ్ల కోసం ఉద్దేశించిన పథ కంలోని రాయితీలను కొన్ని కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వాటికి అందుకున్నాయన్నది ఆరోపణ, తాజా ఈ-డ్రైవ్ పథకంలో ఈమేరకు సవరణలు తీసుకువ చ్చారు. ఇకపై ఈవీ కొనగానే డీలర్ ఒక ఈ-ఓదర్ను కొనుగోలు దారుకు అందచేస్తారు. ఇది ఆధార్ నంబరుతో లింక్ అయి ఉంటుంది.

ఈ ఓవర్ను పీఎం ఈ-డ్రైవ్ పోర్టల్లో నమోదు చేసుకుని తన ఖాతాకు నగదు బదిలీ రూపంలో ప్రోత్సాహ కాన్ని కొనుగోలుదారు అందుకోవచ్చు. ఈవీలకు అవసర మైన విడి భాగాలను స్థానికంగా తయారుచేయాలి. దశల వారీగా ఈ ఆలోచనను ముందుకు తీసుకువెళ్లాలన్నది ఈ పథక మరో లక్ష్యం.



వంద వాహనాలు అమ్ముడవుతుంటే వాటిలో EV’S కేవలం ఆరున్నరే ఉంటున్నాయి. అదే చైనాలో ఇది 27. శాతం, అమెరికాలో 55, ఐరోపాలో 48 శాతంగా ఉంది. దక్షి ఆకొరియాలో పెనెట్రేషన్ 10 శాతం.
కార్లలో ఇంధన నిల్వకు ట్యాంక్ ఉంటుంది. దీనిలో పెట్రోల్ లేదా డీజిల్ నింపుతాం. EV’S ఇంధనం నిల్వ బ్యాటరీయే. లిథియం మూలకం దీనికి అవసరం.



అలాగే ఎలక్ట్రిక్ మోటారు ఇంజన్ మాదిరిగా EV ఉంటుంది. వాహన ధరను ఈ రెండే ప్రధానంగా ప్రభావితం చేస్తాయి. EV’S ధర తగ్గించడానికి, మరింత భద్రంగా అవి తయా రుకావడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధన- అభివృద్ధి ప్రాజె -క్టులు కొనసాగుతున్నాయి. అవి కూడా సానుకూల ఫలితా లనే ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. EV’S డ్రైవింగ్ జాగ్రత్తలు కూడా ప్రజల్లోకి వేగంగా వెళ్తున్నా.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు కూడా మధ్య తరగతి వర్గాల వారిని ఈవీల వైపు ఆకర్షితులను చేస్తున్నాయి.



సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తుండటంతో ఒకరకంగా సమీప భవిష్యత్తులోనే నామమాత్రం ధరకు దూర ప్రయా ణాలు కూడా చౌక కాబోతున్నాయి. దీనివల్ల మానవ సంచారం పెరిగి, ప్రగతి అభివృద్ధి వైపు వడివడిగా అడు గులు పడతాయి. ప్రభుత్వపరంగా కూడా అచితూచి ఆడు గులు వేయాలి. పరిణామ క్రమం ఉపాధి అవకాశాలను దెబ్బతీయకుండా సాగాలి.



ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం లోని ఉపాధి దెబ్బతినకుండా విద్యుత్ వాహనరంగు క్రమేణా ముందుకు రావాలి. భవిష్యత్తు విద్యుత్ వాహనా అదే. ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాల్లో ఈఖీలు అధిక సంఖ్యలో తిరుగుతున్నాయి. మిగిలిన దేశాలదీ అదే బాట అవుతుంది. మరోవైపు కాలుష్య రహిత సమాజం ఆరోగ్య భద్రతకు ఊతమిస్తుంది. EV’S విషయంలో జరుగుతున్న ఆర్ అండ్ డి మెరుగైన ఫలితాలు అందచేస్తే మానవాభి వృద్ధి దిశగా ఆది పెద్ద ముందడుగే అవుతుంది.