
Cop.. వాతావరణ మార్పుపై మానవ పోరాటానికి ఉద్దేశించిన సభ్య దేశాల మహాసదస్సు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ – Cop) సోమవారం నుంచి అజర్బైజాన్ రాజధాని బాకులో ఆరంభమవుతోంది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏటా జరిగే ఈ సదస్సుకు ముందు ఏవో అద్భుతాలు జరిగిపోతాయన్న భ్రమ కలుగుతూనే ఉంటుంది. దేశాల నాయకులు, పారిశ్రామికవేత్తలు, పర్యావరణవేత్తలు, ఉద్యమకారులు, మరోపక్క మాడిపోతున్న, ములిగిపోతున్న దేశాల నుంచి వచ్చే నిరసనకారులతో ఓ పదిరోజులపాటు అజర్బైజాన్ కళకళలాడబోతోంది.
వేడెక్కుతున్న ధరిత్రిని Cop సదస్సు కాపాడుతుందని, కాస్తంత మనసుపెట్టి, నిర్దిష్ట మైన నిర్ణయాలతో మనిషి మనుగడకు మార్గం చూపుతుందన్న నమ్మకం ఏటా ఎంతోకొంత ఉండేది. కానీ, ఈ సదస్సుకు కొద్దిరోజుల ముందు అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికై, ఆ కాస్త ఆశని కూడా ఈ మారు ప్రపంచానికి మిగలనివ్వలేదు.పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పు వంటి మాటలు ట్రంప్‌కు నచ్చవు.
Cop సదస్సు పై అభిప్రాయాలు:
అవన్నీ పర్యావరణవేత్తలుగా చెప్పుకుంటున్నవారు చేస్తున్న శుష్కమైన వాదనలని ఆయన నమ్మకం. ధరిత్రి వేడెక్కడం, ప్రకృతి కోపించడం వంటి మాటలు నమ్మితే తనబోటి, తోటి పారిశ్రామికవేత్తలకు
ఎంత నష్టమో ఆయనకు తెలుసు. పర్యావరణ పరిరక్షణకోసం తపిస్తున్న వారికీ, భూమిని కాపాడుకోవడానికి కృషిచేస్తున్నవారికీ ఆయన ఎన్నిక ఒక ప్రమాదకర హెచ్చరిక.
వాతావరణమార్పు మీద ట్రంప్ తన తొలి విడత పాలనలో ఎంతటి వ్యతిరేక వైఖరి తీసుకున్నారో తెలిసిందే. పారిస్ ఒప్పందం అమెరికా శత్రువని ఆయన ప్రకటించాడు. భారత్, చైనా వంటి దేశాలను ఇష్టారాజ్యంగా శిలాజ ఇంధనాలను వాడుకోనిచ్చి. విమర్శించాడు. అమెరికా అమెరికాకు మాత్రమే ఈ డాక్యుమెంట్ ఉరితాళ్ళు వేస్తున్నదని ప్రయోజనాలకు వ్యతిరేకంగా, దానికి డ్రిల్…డ్రిల్. డ్రిల్ అన్న ఒకే ఒక్క నినాదంతో ఆయన తన విధానం అన్యాయం చేస్తున్న ఈ ఒప్పందం నుంచి వైదొలగాలని నిర్ణయించాడు.
ఆ తరువాత జో బ్రెడెస్ అధికారంలోకి రాగానే ఆ నిర్ణయాన్ని తిరగదోడిన మాట వాస్తవమే కానీ, తాను మళ్ళీ అధికారం లోకి రాగానే తిరిగి అదే పని చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించాడు. ఇరాన్ పాశ్చాత్య దేశాలు చేసుకున్న అణు ఒప్పందాన్ని ఇజ్రాయెల్ కోసం కాలదన్ని ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేసిన ట్రంప్, పారిస్ ఒప్పందాన్ని మళ్ళీ కాదనడం ఖాయం. క్లైమేట్ ఫైనాన్స్ అంటే అమెరికా కష్టపడి సంపాదించిన సొమ్మును వేరొకరి చేజేతులా ధారపోయడమని ఆయన నిర్వచనం.
Cop సదస్సు..అభివృద్ధి చెందుతున్న దేశాలు:
అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిధులు సమకూర్చడం, నష్టాలను భర్తీ చేయడం, ఉద్గారాలను నియంత్రించుకోవడం వంటి పలు అంశాల్లో గత ఏడాది దుబాయ్ సదస్సులో అడుగు ముందుకుపడింది. గతాన్ని సమీక్షించుకోవడం మీద అది శ్రద్ధపెట్టినందువల్ల, భవిష్యకార్యాచరణ చర్చ విస్తృతంగా జరిగింది. మూడుదశాబ్దాల Cop సదస్సుల చరిత్రలో శిలాజ ఇంధనాలు అన్న పదం సంయుక్త ప్రకటనలో చేరడం అదే తొలి సున్నా చేయాలని సంకల్పం చెప్పుకుంది.
పారిస్ సదస్సు తీర్మానించిన సారి. 2050కల్లా వాటి వినియోగాన్ని దశలవారీగా వదులుకుంటూ ప్రకారం భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 15 డిగ్రీల సెల్సియస్‌కు పరి మితం చేయడానికి వీలుగా కర్బన ఉద్గారాలను వేగంగా తగ్గించుకోవా లని, 2050కల్లా తటస్థత సాధించాలని Cop సదస్సు నిర్ణయించింది. తదను గుణంగా వ్యూహాలు, విధానాలు రాసుకుంటానని అమెరికా కూడా హామీ ఇచ్చింది.
ప్రధానంగా ధనికదేశాల దురాశే వాతావరణ మార్పులకు, తద్వారా పేదదేశాలకు సంభవించే నష్టాలకు కారణం కనక, వాటిని ఆదుకొనే నిధి విషయంలోనూ ఈ సదస్సు తొలిరోజునే ప్రశంసనీయ మైన అడుగువేసింది. ‘లాస్ అండ్ డామేజ్ నిధికి హామీపడిన మేరకు ధనికదేశాలు నిధులు సమకూర్చని మాట నిజమే కానీ, 2030కల్లా ఏటా వందబిలియన్ డాలర్లు సమకూర్చుకోవాలన్న కొత్త లక్ష్యం నెరవే రితే పేదదేశాలకు ఈ నిధి కచ్చితంగా మేలుచేస్తుంది.
ధరిత్రిని రక్షించు కొనే విషయంలో అజర్బైజాన్ సదస్సులో మరిన్ని నిర్దిష్టమైన అడుగు లుపడతాయని నమ్ముతున్న తరుణంలో, ట్రంప్ మరో రాకడ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. మరో నాలుగేళ్ళపాటు అమెరికా ఏ గట్టున ఉండబోతున్నదో ఎలాగూ తెలిసిపోయింది కనుక, యూరోపియన్ యూనియన్, చైనా, ఇండియా, అభివృద్ధి చెందుతున్న దేశాలు చేయీ చేయీ కలిపి లక్ష్యాల సాధన దిశగా కృషిచేయడం అవసరం.
గతంలో ఎప్పుడూ లేని రీతిలో అత్యధిక ఉష్ణోగ్రతలో మానవ జాతి నివసిస్తోంది. సముద్ర మట్టం మూడు రెట్లు వేగంగా పెరుగుతోంది. భూమి ఉష్ణోగ్రత 1.2 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగింది. ఒకటిన్నర డిగ్రీల పెరుగుదల వరకు భరించవచ్చు. అయితే కర్బన ఉద్గారాల పెరుగుదలతో ఇది ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. 2030 నాటికి కర్బన ఉద్గారాలు సగానికి సగం తగ్గాల్సి ఉంది. 2050 నాటికి సున్నా స్థాయికి చేరాలి. అలా అయితేనే పెరుగుతున్న ఉష్ణోగ్రతల నియంత్రణ సాధ్యం.
ప్రపంచం ఒక నిర్దిష్ట ప్రణాళికతో గ్లోబల్ వార్మింగ్ తగ్గించటానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Cop Agenda ఎజెండా ఇదీ..
Cop ఎజెండా ప్రకారం బొగ్గు వాడకం తగ్గించడం, అడవుల నరికివేత మీద నిషేధం, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించటం, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించటం, తీరప్రాంత రక్షణ కోసం చర్యలు తీసుకోవటం వంటి చర్యలు చేపట్టాలి. అన్ని దేశాలూ Cop సదస్సుకు హాజరై 2015 నాటి పారిస్ సదస్సు లక్ష్యాలు సాధించేందుకు నిర్దిష్టమైన నిబంధనలు రూపొందించుకోవాలి. పారిస్ సదస్సులో నేషనల్ డిటర్మైండ్ కంట్రిబ్యూషన్ పేరుతో అన్ని దేశాలకూ లక్ష్యాలు నిర్దేశించారు. కానీ అభివృద్ధి చెందిన దేశాలు ఈ దిశగా చర్యలు చేపట్టలేదు.ఎన్నో పోస్ట్‌లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు.
Cop సదస్సులో ప్రధానమంత్రి ‘పంచామృతం’ ఐదు సూత్రాలు:
ఐక్యరాజ్య సమితి 26వ వాతావరణ మార్పు సదస్సు లో ప్రధాని నరేంద్రమోదీ ‘పంచామృతం’ అనే ఐదు సూత్రాలు ప్రతిపాదించారు.
- నికరంగా కర్బన ఉద్గారాల శూన్య స్థాయి లక్ష్యసాధన గడువు 2070
- 2030 నాటికి కర్బన ఉద్గారాలు 100 టన్నులకు తగ్గింపు
- 2030 నాటికల్లా కర్బన తీవ్రత 45 శాతం మేరకు తగ్గింపు
- 2030 నాటికి విద్యుత్ అవసరాలలో 50 శాతం మేరకు పునరుత్పాదక వనరులతోనే తీర్చుకోవాలి
- 2030 నాటికి శిలాజేతర ఇంధన సామర్థ్యం 500 గిగావాట్ల కు పెంపు
కర్బన ఉద్గారాల విడుదలలో మన వాటా :
ప్రపంచ జనాభాలో మన వాటా 17 శాతంగా ఉంది. అయితే భారతదేశంలో వెలువడుతున్న కర్బన ఉద్గారాలు.. మొత్తం కర్బన ఉద్గారాల్లో 5 శాతమే. ఇప్పటికే కర్బన ఉద్గారాల తగ్గింపులో మన దేశం అనేక అడుగులు వేసింది.
వాహనాల పొగలో కర్బన పరిమాణాన్ని తగ్గించటానికి పెట్రోల్‌లో ఇథనాల్ వాడుతున్నారు. ఇలా చేస్తున్న దేశాల్లో బ్రెజిల్ తరువాత భారత్ రెండో దేశం.
బీఎస్-4 తరువాత నేరుగా బీఎస్-6 ఇంధనం వాడేలా చర్యలు తీసుకుంది.
2030 నాటికి గ్రీన్ హౌస్ వాయువుల విడుదల తీవ్రత 33 నుంచి 35 శాతం మేర తగ్గించాలన్న పారిస్ ఒప్పందపు లక్ష్యసాధన దిశగా పయనిస్తూ ఇప్పటివరకు భారత్ ఆ తీవ్రతను 21 శాతం మేర తగ్గించింది.
జి-20 దేశాలలో భారత్ మాత్రమే ప్రపంచ ఉష్ణోగ్రత స్థాయి 2 డిగ్రీలకు మించకుండా కృషి చేస్తోంది.
నేషనల్ హైడ్రోజన్ మిషన్ ద్వారా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం రూ. 1500 కోట్లు కేటాయించింది.
2030 నాటికి మొత్తం ఇంధన అవసరాలలో సహజ వాయువు వాటాను 15 శాతానికి పరిమితం చేయటం లక్ష్యంగా పెట్టుకుంది.
21 రాష్ట్రాలలో మొత్తం 26,694 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 47 సౌర విద్యుత్ పార్కుల ఏర్పాటు జరుగుతోంది. కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే సౌర విద్యుత్తు పార్కులు ఏర్పాటయ్యాయి.
జాతీయ ఆధునిక రసాయన బ్యాటరీ నిల్వ కార్యక్రమం పేరుతో ఉత్పాదకతతో అనుసంధానమైన ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది. దీని వల్ల చమురు దిగుమతులు తగ్గి నికరంగా రూ. 2,50,000 కోట్లు ఆదా అవుతుంది.
ఫేమ్ ఇండియా కారణంగా దేశంలో రోజుకు 85,605 లీటర్ల ఇంధనం ఆదా అవుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదలకు ఆదాయ పన్ను రాయితీ సహా అనేక చర్యలు చేపడుతోంది.
గత అయిదేళ్లలో దేశంలో 15 వేల చదరపు కిలో మీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకుంది.
Cop సదస్సులో తీసుకున్న్ నిర్ణయాలు..
అన్నీ దేశాలూ తమ 2030 వాతావరణ కార్యాచరణ ప్రణాళికలను మరింత బలోపేతం చేసుకోవాలి. లక్ష్య సాధన కోసం సత్వర ఆచరణ మొదలు కావాలి.
2030 వాతావరణ కార్యాచరణ లక్ష్యాన్ని పెంచటానికి మంత్రుల వార్షిక సమావేశం జరుగుతుంది. ఈ లక్ష్య సాధనకు దేశాలు ఏం చేస్తున్నాయో ఉమ్మడి నివేదిక రూపొందించాలి.
వాతావరణ కార్యాచరణ లక్ష్యాన్ని ప్రోత్సహించేలా 2023లో అంతర్జాతీయ నాయకులతో సమావేశం ఏర్పాటుకు ఐరాస సెక్రెటరీ జనరల్‌కు విజ్ఞప్తి చేసింది. అన్ని దేశాలూ ఇంధన వనరుగా బొగ్గు వాడకం తగ్గించాలి. శిలాజ ఇంధనాల మీద సబ్సిడీలలో కోత పెట్టాలి. దశలవారీగా బొగ్గు వాడకాన్ని తగ్గించాలి.
అన్ని దేశాలూ శిలాజ ఇంధనాలను క్రమంగా తగ్గించాలి. 2019 స్థాయి నుంచి 2025కు ఎదగటానికి వీలుగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు ఇచ్చే నిధులను కనీసం రెట్టింపు చేయాలి. అంతర్జాతీయ లక్ష్యాలను నిర్వచించటానికి రెండేళ్ళ కార్యాచరణ తయారైంది.