Immunity Boosting in 4 Ways వ్యాధినిరోధకశక్తి పెంచే 4 విధానములు

Immunity Boosting

Immunity పెరగాలంటే:


Immunity పెంచే ఆహారం ఏది? వెనువెం టనే శక్తిగా మారే ఏ పదార్థమైనా వ్యాధినిరోధకశక్తిని పెంచేదే! ఏ ఆహారమైతే జీర్ణాగ్నిని కుంటుపరుస్తుందో అది వ్యాధినిరోధకశక్తిని తగ్గిస్తుంది. పరిపూర్ణంగా జీర్ణ మవడం మూలంగా అందే శక్తి మంచి ఆరోగ్యానికి, సమతుల భావోద్వేగాలకు, Immunity కీ తోడ్పడు తుంది సులభంగా జీర్ణం కాని ఆహారం తీసుకోవడం వల్ల ఒరిగే ఫలితం ఇందుకు విరుద్ధంగా, రోగనిరోధకశ క్లిని కుంటుపరిచేలా చేస్తుంది. కాబట్టి ఆహారనియ మాల పట్ల కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

Immunity కీ .. తేలికపాటి ఆహారం:


పళ్లు, కూరగాయలు, పొట్టుతో కూడిన ధాన్యాలు. పప్పుదినుసులు, పాల ఉత్పత్తులు తేలికగా జీర్ణమవు తాయి. పొట్టు తీయకుండా, పాలిష్ పట్టకుండా ఉన్న పరిపూర్ణ ధాన్యాలు ఆహారంగా తీసుకున్నప్పుడు తేలి కగా అరిగి త్వరిత శక్తినిస్తాయి. పాలిష్ పట్టిన, నిల్వ ఉంచిన, కృత్రిమ రుచులు జోడించిన పదార్థాలు అజీ ర్తిని కలిగించి శరీరంలో అగ్నిని రాజేస్తాయి. శక్తిని కణాలకు చేరకుండా చేస్తాయి. ఫలితంగా Immunity సన్నగిల్లుతుంది.

పురుగు మందులు, ఎరువులు వేయకుండా పండించిన సేంద్రీయ పంటల్లో ఖనిజలవణాలు, విటమిన్లు, పీచు పుష్కలంగా ఉంటాయి. వృక్షసంబంధ మాంస కృత్తులు పరిపూరంగా ఉంటాయి. ఇంట్లో తయారుచేసిన జున్ను, పాలు, పప్పుదినుసులు (కందిపప్పు, మినుములు, పెసలు), కూరగా యలు ( చిక్కుళ్లు, పచ్చిబఠాణీ) శక్తిని అందిస్తాయి.


Immunity కీ దినుసులు:


ఆహారంలోని పోషకాలను నష్టపరచని దీను సులను వంటలో జోడించాలి. ఇందుకోసం మరీ ఘాటైనవి కాకుండా తేలికపాటి దినుసలను ఆహారానికి జోడించడం ద్వారా ఆహారం తేలి కగా అరిగి త్వరిత శక్తిని అందించగలుగు తుంది. మంచి రుచికి దినుసులు తోడైతే, తేలి ‘కగా జీర్ణమవడంతోపాటు పోషకాలను శరీరా నికి తేలికగా అందే మార్గం సుగమమవుతుంది. మనం ఆహారంలో పసుపు, కారం, జీలకర్ర, మెంతులు… ఇలా ఎన్నో రకాల దినుసులను జోడిస్తూ ఉంటాం.

వీటిలో పసుపుకు Immunity ఇనుమడింపజేసే గుణం ఉంటుంది. పసుపు శరీరం లోని విషాలను హరించడంతోపాటు రోగనిరోధకశక్తికి సంబంధించిన కణాలకు శక్తినిస్తుంది. జీలకర్ర వేడిని చంపుతుంది. నల్ల మిరియాలు శరీర కణజాలాలక శక్తి నేరుగా అందేలా చేస్తాయి. శక్తిని పెంచే ఆహారం!

మధ్యాహ్న భోజనం తర్వాత బొప్పాయి తింటే జీర్ణశక్తితోపాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆవ ఆకులు, పాలకూరల్లో ఉండే ఐరన్, క్యాల్షియం, ఇతర పోషకాలు శక్తిని పెంచడంతోపాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యాబేజి, కాలిఫ్లవర్లలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనా యిడ్లు కూడా Immunity దోహదపడేవే! బార్లీ. తోటకూర విత్తనాలు, క్వినోవాలలో వ్యాధినిరోధకశక్తిని పెంచే పోషకాలు ఉంటాయి.


శక్తి ప్రభావాన్ని పెంచే పదార్థాల్లో పాలు, నెయ్యిలు ప్రధానమైనవని ఆయు ర్వేదం సూచిస్తోంది. కాబట్టి చిటికెడు యాలకుల పొడి వేసి కాచిన పాలు తాగాలి. భోజనానికి రెండు గంటల ముందు లేదా తర్వాత తాగడం వల్ల పోషకాలు సక్ర మంగా శరీరానికి అందుతాయి. నెయ్యి ఇంట్లో తయా రుచేసినదై ఉండాలి.

వండే విధానం!


వండి తినడం వల్ల ఆహారం అరిగే వేగం పెరుగు తుంది. అలాగని ఆహారాన్ని అవసరానికి మించి ఉడి. కిస్తే వాటిలోని రోగనిరోధకశక్తి వృది కారకాల నష్టం జరుగుతుంది. ఆహారం నమలడానికి, తినడానికి, వి అంగడానికి మెత్తగా ఉండాలి కానీ సాగకూడదు. సమయపాలన పాటించాలి!
వండి తినడం వల్ల ఆహారం అరిగే వేగం పెరుగుతుంది. అలాగని ఆహారాన్ని అవసరానికి మించి ఉడికిస్తే వాటిలోని Immunity వృద్ధి కారకాల నష్టం జరుగుతుంది. ఆహారం నమలడానికి, తినడానికి, మింగడానికి మెత్తగా ఉండాలి కానీ సాగేలా ఉండకూడదు.

ఆహారవేశాలు నియమబద్దంగా సాగాలి. ప్రధాన భోజనం మధ్యాహ్నం, సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు తినాలి. ఈ సమ యంలో జీర్ణశక్తి అమోఘంగా, బలంగా ఉంటుంది. రాత్రివేళ జీర్ణశక్తి బలహీనంగా ఉంటుంది కాబట్టి, తేలికపాటి అల్పాహారం తీసుకోవాలి. ఇలాంటి ఆహార, సమయ నియ మాలు పాటిస్తే Immunity మెరుగ్గా సాగుతుందని ఆయుర్వేదం చెప్తోంది.ఎన్నో పోస్ట్‌లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు.

Immunity కీ సరైన పరిమాణాలూ ముఖ్యమే!


శరీర తీరు, తత్వాలకు తగిన పరిమా ణాల్లో ఎక్కువ, తక్కువ కాకుండా ఆహారం తీసుకోవాలి. ఆహారంతోపాటు గది ఉష్ణోగ్ర తకు దగ్గర్లో ఉన్న నీరు తీసుకుంటే ఆహారం కొంత ద్రవ రూపం దాలుస్తుంది. జీర్ణశక్తికి ఇది అవసరం. పొట్టలో పావు వంతు ఖాళీ జాగా వదిలితే తేలికగా జీర్ణం జరుగుతుంది. పొట్ట నిండా తింటే అరిగే జాగా లేక అజీర్తి తలెత్తుతుంది.

పండ్లు తింటే బరువు తగ్గుతామా?


బరువు తగ్గడం కోసం రాత్రి భోజనానికి బదు లుగా పండ్లు తినే ధోరణి ఇటీవల ఊపందు కుంది. అయితే పండ్లతో నిజంగానే బరువు తగ్గే వీలుందా? తెలుసుకుందాం! మధ్యాహ్నం భారీగా భోంచేసినప్పుడు, రాత్రికి అంతగా ఆకలి వేయకపోవచ్చు. అలాంటి సంద ర్భాల్లో, లేదా అజీర్తి తలెత్తినప్పుడు రాత్రి భోజనా బదులుగా పండ్లతో సరిపెట్టుకోవడం మంచిదే! అయితే ప్రతి రాత్రీ పండ్లతో సరిపెట్టుకో వడం ఆరోగ్యకరం కాదంటున్నారు వైద్యులు.

యాపిల్ పళ్లలో రోగనిరోధకశక్తికి దోహదపడే యాంటీఆక్సిడెంట్లు, సుఖ విరోచనానికి అవసరమయ్యే పీచు పుష్కలంగా ఉంటాయి. తీయగా ఉండి, రసంతో కూడిన మామిడి, అనాస పళ్లు త్వరగా శక్తి రూపం దాలుస్తాయి. ఫలితంగా Immunity పెరుగు తుంది. అవే పళ్లు చెట్టుకు పండినవైతే శక్తి మరింత త్వరితంగా అందుతుంది. దానిమ్మరసం, దానిమ్మ గింజల పచ్చడి, పిత్త దోషం పెరగకుండా చేస్తూనే, జీర్ణశక్తిని పెంచుతాయి. కాబట్టి పరోక్షంగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

పండ్లలో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు లోపి స్తాయి కాబట్టి ఇదే అలవాటును కొనసాగిస్తే
పోషక లోపం తలెత్తే వీలుంటుంది. అలాగే రాత్రి పండ్లతో పొట్ట నింపుకోవడంతో, మరుసటి ఉద యానికి ఆకలి ఎక్కువై భారీ బ్రేక్ఫాస్ చేసే అవ కాశం ఉంటుందనీ, దాంతో అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరిపోయే ప్రమాదం ఉంటుందని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే పండ్లలో విటమిన్లు, పీచు, ఖనిజ లవణాలతో పాటు, సహజ చక్కెరలు కూడా ఎక్కువే.

ఇవి రక్తంలోని చక్కెర మోతాదులను పెంచేస్తాయి. ఇదే అలవాటును దీర్ఘకాలం పాటు కొనసాగిస్తే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ శక్తిని ఉపయోగించుకోలేకపోతే, కొవ్వుగా శరీరంలో పేరుకుపోతుంది. కాబట్టి ఈ సమస్యలు తలెత్తకుండా ఉండడం కోసం పండ్లను పెరుగు, నట్స్తో కలిపి తీసుకోవాలి. అలాగే రాత్రిపూట పండ్లను తినడానికి ఇష్టపడే వారు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే, బెర్రీస్, యాపిల్స్, బొప్పాయి, పియర్స్ మొదలైన పండ్లను ఎంచుకోవాలి.